ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటోపై వివాదం

  • 2 years ago
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం జిల్లాలో నిర్వహించిన గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్సీ అనంతబాబు ఫోటో ఉండటం కలకలం రేపుతోంది. దేవిపట్నంలో మండలం ఇందుకూరుపేటలో ఎమ్మెల్యే ధనలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సభా వేదికపై అనంతబాబు ఫోటో దర్శనమివ్వడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇందుకూరుపేటలోనే వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. అనంతబాబు ఫ్లెక్సీని గ్రామంలో ఊరేగించిన కార్యకర్తలు ఫోటోపై పూలు జల్లుతూ నినాదాలు చేశారు.

Recommended