CM Jagan Launches ACB 14400 App: అవినీతిని రిపోర్ట్ చేయడంలో ఉపయోగపడే ఏసీబీ 14400 యాప్ | ABP Desam

  • 2 years ago
అవినీతిని నిరోధించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఓ ప్రత్యేక యాప్ వచ్చింది. ఏసీబీ 14400 పేరుతో ఆ శాఖ తయారు చేసిన యాప్ ను CM Jagan తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఏ స్థాయిలోనూ అవినీతికి తావు ఉండకూడదన్నదే ప్రభుత్వ విధానమని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ఎవరైనా అవినీతిని రిపోర్ట్ చేయొచ్చని, ఆ డేటా నేరుగా ఏసీబీకి చేరుతుందని వివరించారు. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న ఈ యాప్ త్వరలోనే ఐఓఎస్ వర్షన్ లోకి రానుంది.

Recommended