ఈసారి టీడీపీ అధికారంలోకి రాకపోతే.. నల్లారి కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 2 years ago
టీడీపీలో పనిచేసేవాళ్లకే స్థానం ఉంటుందంటున్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. పార్టీ కమిటీలు వేసినంత మాత్రాన ఉపయోగం లేదని.. పనిచేస్తేనే కమిటీలో ఉండాలని నేతలకు సూచించారు. పార్టీలో పనిచేసేవాళ్లకు స్థానం ఉంటుందని.. పనిచేయకుండా ఇళ్లలో కూర్చుంటే ఉపయోగం లేదని.. ఈ రెండేళ్లు కచ్చితంగా కష్టపడితే ప్రభుత్వం వస్తుందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది ఓట్లు వేస్తారనుకుంటే కష్టమని.. యూపీలో అఖిలేష్ యాదవ్ రెండేళ్లు ముందు నుంచి కష్టపడి ఉండుంటే గెలిచేవారన్నారు. ఆయన మూడు నెలల ముందు వచ్చి ట్రై చేసి ఓడిపోయారని వ్యాఖ్యానించారు..'మనం కూడా మూడు నెలల ముందు ప్రయత్నం చేద్దాం గెలిస్తే గెలుద్దాం, పోతే పోదాం అనుకుంటే లాభం లేదు. ఇప్పుడే రాజకీయాలు వదిలేయడం మంచిది' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండేళ్లు కమిటీలన్నీ సైనికుల్లా పనిచేయాలని.. అందర్నీ కలుపుకుని ముందుకు సాగాలన్నారు. పదవులు ఉన్నవాళ్లు అందరితో ఐక్యంగా ఉండాలని.. గ్రామాల్లో పదవులు వచ్చే వరకు ఒకలా.. వచ్చాక మరోలా ఉంటున్నారన్నారు. ఆ పద్దతి మార్చుకోవాలి.. పార్టీకి పనిచేసేవాళ్లు కావాలన్నారు. ఏదో పేపర్‌లో పేరు, పదవి కావాలనుకుంటే.. అలాంటి వారు పార్టీకి వద్దని హితవు పలికారు.