సీఎం కేసీఆర్ జార్ఖండ్ టూర్.. సోరెన్‌తో భేటీ

  • 2 years ago
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జార్ఖండ్ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ నుంచి ఆయన రాంచీకి చేరుకున్న కేసీఆర్.. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లారు. సోరెన్ దంపతులు సీఎం కేసీఆర్‌ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కేసీఆర్ వెంట కూతురు కవిత, ఎంపీ సంతోష్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు. సీఎం కేసీఆర్ సీనియర్ పొలిటీషియన్ శిబూ సోరెన్‌తో భేటీ అయ్యారు.