ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ నేత.. ఇద్దరి మధ్య మాటల యుద్ధం
  • 2 years ago
నెల్లూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్సార్‌సీపీలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కొత్త జిల్లాల విషయంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో రాపూరు, కలువాయిని కొనసాగించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజనలోస్వార్థ రాజకీయం కోసం కాంగ్రెస్ హయాంలో కొందరు రాపూరు, కలువాయి వాసులకు ద్రోహం చేశారని విమర్శించారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేత నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో జిల్లాలపునర్విభజనను స్వాగతిస్తున్నామని నేదురుమల్లి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో ఉన్న ప్రతీ నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. ఎన్నో జన్మల పుణ్య ఫలం ఉంటేనే శ్రీ బాలాజీ జిల్లాలో గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు కలిశాయన్నారు. శ్రీ బాలాజీ జిల్లా అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని.. త్వరలోనే గూడూరు నియోజకవర్గ ప్రజలకు శ్రీ బాలాజీ జిల్లా లో కలవడం వలన ఎంత మేలు జరుగుతుందో తెలుస్తుందన్నారు.
Recommended