చలో విజయవాడ వెళ్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు

  • 2 years ago
ఏపీలో పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వ జీవోవలకు వ్యతిరేకంగా ఉద్యోగులు పిలుపునిచ్చిన చలో విజయవాడతో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు చెబుతుంటే.. ఉద్యోగులు కూడా వెనక్కు తగ్గేది లేదంటున్నారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం విజయవాడ చేరుకుంటున్నారు. వీరంతా పెద్ద ఎత్తున నినాదాలతో BRTS రోడ్డు వద్దకు చేరుకున్నారు.శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటూ ఉంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారు ఉద్యోగులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతి లేదని తమతో వాగ్వాదం చేయొద్దని పోలీసులు అంటున్నారు.. పలువురు ఉద్యోగస్తులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి BRTS రోడ్డులో కార్లు, బైక్‌ల రాకపోకలను నిలిపివేశారు.

Recommended