Rains : Low Pressure బంగాళాఖాతంలో అల్పపీడనం మళ్లీ వర్షాలు | TN -Sri Lanka Coast || Oneindia Telugu
  • 2 years ago
Rains: A low pressure area is expected along the southern Tamil Nadu-Sri Lanka coast in the southwestern Bay of Bengal on Wednesday, meteorological department said. This low pressure likely to affect 2 districts of rayalaseema
#southwesternBayofBengal
#APRains
#lowpressureareaBayofBengal
#TamilNaduSriLankacoast
#TirupatiFlashFloods
#Tirumalamassiveflood
#APCMJagan
#TN

వాతావరణ శాఖ మరో పిడుగు లాంటి సమాచారం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు-శ్రీలంక తీరంలో(ఈ రోజు) బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని, దీని ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి శ్రీలంక-ఉత్తర తమిళనాడు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి 26వ తేదీన తమిళనాడు, శ్రీలంక ప్రాంతాల్లోనే తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో 26, 27 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో, 27వ తేదీ వైఎస్సార్‌ జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు.
Recommended