Michael Vaughan takes dig at Indian men's team | Oneindia Telugu

  • 3 years ago
Michael Vaughan takes dig at Indian men's team: At least 1 Indian team can play in English conditions
#MichaelVaughan
#Teamindia
#ViratKohli
#Indvseng
#MithaliRaj

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ మరోసారి భారత జట్టును ఎగతాళి చేశాడు. భారత మహిళల జట్టును ప్రశంసించిన మైకేల్ వాన్.. కోహ్లీసేన పట్ల వెటకారంగా మాట్లాడాడు.కనీసం ఒక భారత జట్టు అయినా ఇంగ్లండ్‌ పరిస్థితుల్లో పోరాడుతోందని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో భారత మహిళలు, పురుషుల జట్లు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఏకైక టెస్టు మ్యాచ్‌ను అసాధారణ పోరాటంతో డ్రా చేసుకున్న మిథాలీ సేన 3 వన్డేల సిరీస్‌ను 2-0 చేజార్చుకుంది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలైంది. తొలి వన్డేతో పోలిస్తే రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శనే చేసింది. ఈ క్రమంలోనే వాన్.. మిథాలీ సేనను ప్రశంసిస్తూ కోహ్లీసేనపై సెటైర్లు పేల్చాడు

Recommended