Upendra : సీఎం అవ్వాలనుకుంటున్నా.. Karnataka ఎలక్షన్స్ కి Real Star సిద్దం || Oneindia Telugu

  • 3 years ago
Upendra wants to be CM of Karnataka
#Upendra
#Karnataka
#Kannadiga
#Bangalore
#Uttamaprajakeeyaparty

ఉపేంద్ర.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్. అటు డబ్బింగ్, ఇటు స్ట్రెయిట్ మూవీల ద్వారా తెలుగు, తమిళ ప్రేక్షకులకూ చిరపరిచితుడే. శాండల్‌వుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న సమయంలోనే రాజకీయాల్లో ప్రవేశించారు. సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. ఉత్తమ ప్రజాకీయ పార్టీ పేరుతో దాన్ని కొనసాగిస్తోన్నారు. 2017 నాటి ఎన్నికల్లో పోటీకి సిద్ధపడిన తరుణంలో.. పార్టీలో అంతర్గత విభేదాల వల్ల పోటీకి దూరమయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సమాయాత్తమౌతోన్నారు.

Recommended