• 4 years ago
It's time for Andhra Pradesh government to find other revenue sources as Central Government imposed some strict rules
#CentralGovernment
#Andhrapradesh
#Ysjagan
#YSRCP

ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నవరత్నాల పేరిట తీసుకొచ్చిన భారీ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానా సహకరించే పరిస్ధితి లేదు. దీంతో ఏటికేడాది అప్పులను భారీ స్ధాయిలో పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం.. ఈ విషయంలో కేంద్రంతో పాటు ఆర్ధిక సంస్ధలు చెప్పినట్లు ఆడాల్సిన పరిస్ధితికి వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాటలు చూసినా ప్రజల సంక్షేమం కోసమే అప్పులు చేస్తున్నట్లు బహిరంగంగానే చెప్పుకునే పరిస్ధితి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో పోల్చుకుంటూ తాము పరిమితి దాటడం లేదని కూడా చెబుతోంది. ఈ వాదనలన్నింటికీ చెక్‌ పెడుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

Category

🗞
News

Recommended