YS Jaganmohan Reddy announced a bumper offer for women | Oneindia Telugu
  • 3 years ago
Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy announced a bumper offer for women on the occasion of National Women's Day on the 8th of this month. A 10 per cent discount has been announced for women who buy a mobile phone today. He said women can get a discount at selected mobile shops in the state.
#APCMYSJagan
#Jaganoffersforwomen
#DishaMobileApp
#10percentdiscountforwomen
#AndhraPradeshChiefMinisterYSJaganmohanReddy
#mobilephone
#NationalWomensDay
#IWD2021
#womensday2021
#AndhraPradesh
#APGovt
#YSRCP
#Leavesforwomen

ఈ నెల 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు బంపరాఫర్ ప్రకటించారు. ఆరోజు మొబైల్ ఫోన్ కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ప్రకటించారు. రాష్ట్రంలోని ఎంపిక చేసిన మొబైల్ షాపుల్లో మహిళలు రాయితీ పొందవచ్చునని తెలిపారు. అయితే మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికే రాయితీ వర్తిస్తుందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్, సంపూర్ణ పోషణ పథకాలపై గురువారం(మార్చి 4) క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రత, సంక్షేమం, అభివృద్దికి సంబంధించి పలు కీలక అంశాలపై జగన్ అధికారులతో చర్చించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 7న రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లో క్యూఆర్‌ కోడ్‌తో 2000 స్టాండ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన షాపుల్లో మొబైల్‌ ఫోన్లు కొనుగోలు చేసే మహిళలకు 10శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆఫర్ పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recommended