Journalists should be given Covid-19 vaccine jab in second phase: Satyavati Rathod
  • 3 years ago
Journalists have worked during the pandemic and should be considered as frontline warriors, said minister Satyavati Rathod. Smt. Satyavathi Rathod, Minister of ST Welfare, Women & Child Welfare said she would urge the state Chief Minister to include the journalists in frontline warriors and administer the vaccine to them in the second phase.

#SatyavatiRathod
#Journalists
#SmtSatyavathiRathodMinisterofSTWelfareWomenChildWelfare
#Journalistsfrontlinewarriors
#JournalistsCovid19vaccinejabsecondphase
#Telangana
#Coronavirus
#covid19vaccination
#TRS
#CMKCR
#COVIDVaccine


జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను, కరోనా సమయంలో జర్నలిస్టుల సేవలు నిరుపమానం,ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులకు రెండో దశలో కరోనా వ్యాక్సిన్ ఇప్పిస్తాము.. ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొచ్చే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టియుడబ్ల్యుజే డైరీ ఆవిష్కరణ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో వైరస్ బారిన పడిన వారి ఇబ్బందులను తెలుసుకునేందుకు రిస్క్ చేసిన జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి, రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చే టీకా కార్యక్రమంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని సిఎం కేసిఆర్ ను కోరుతానని చెప్పారు. మహబూబాబాద్ జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చి, వాటిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టుకునేలా తాను ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో దాదాపు 5వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో చాలామంది ఆక్రమణలు చేసి, ఇండ్లు కట్టుకున్నారని, కొంతమంది అమ్ముకున్నారనే దాఖలాలు ఉన్నాయన్నారు. ఈ భూములపై సర్వే జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జర్నలిస్టులకు ఏమి ఇచ్చారు, ఎంత ఇచ్చారనేది పట్టించుకోకుండా అర్హత ఉండి లబ్ది పొందని ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

Recommended