Sonu Sood Helps A Tribal Girl In Chhatisgarh
  • 4 years ago
Bollywood actor Sonu Sood came out in support of a tribal girl in Chhatisgarh’s Maoist-affected Bijapur district of Bastar region. The girl had lost her house and books due to incessant rains in the region for the last five days.
#Sonu Sood
#SonuSoodRealHero
#Bollywood
#COVID19
#Lockdown
#helping
#PoorPeople
#Humanity

నటుడు సోనూసూద్‌ మరో సారి తన మంచితనాన్ని చాటుకున్నారు. వర్షాల కారణంగా ఇళ్లు, పుస్తకాలు కోల్పోయిన బాలికకు బాసటగా నిలిచారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఛత్తీస్‌ఘర్‌లోని మావోయిస్టు ప్రభావిత జిల్లా బిజాపూర్‌, బస్తర్‌లోని అంజలి‌ అనే బాలిక ఇల్లు కూలిపోయింది. దాంతో ఆమె పుస్తకాలన్నీ నీటిలో తడిచి ముద్దయ్యాయి. వాళ్ళ ఇంట్లోని వస్తువులన్నీ పాడయ్యాయి. దాంతో ఈ విషయాన్ని ఆ గ్రామానికి చెందిన ఓ జర్నలిస్ట్ ముఖేష్‌ చంద్రకర్‌ వీడియో తీసి తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.. ఇక ఆ వీడియో కాస్తా సోనూ సూద్ కంట పడటంతో ఆయన స్పందించారు. ‘‘ కన్నీళ్లు తుడుచుకో చెల్లెలా. ఇళ్లు కొత్తదవుతుంది.. పుస్తకాలు కూడా కొత్తవవుతాయి’’ అంటూ బుధవారం ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై ముఖ్యమంత్రి భూపేశ్‌ బాగేళ్ సైతం స్పందించి బాలిక కుటుంబానికి సహాయం చేయవల్సిందిగా అధికారులను ఆదేశించారు.
Recommended