బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్ 7 డార్క్ షాడో ఎడిషన్

  • 4 years ago
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ అందిస్తున్న 'ఎక్స్‌7' ఎస్‌యూవీలో డార్క్ షాడో లిమిటెడ్ ఎడిషన్ పేరిట కంపెనీ కొత్త స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ స్పెషల్ ఎడిషన్ కారుని ప్రపంచ వ్యాప్తంగా కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయనున్నారు. 2020 ఆగస్టు నుండి అమెరికాలోని స్పార్టన్‌బర్గ్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారు.

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ కారు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని, ప్రస్తుత బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్7 మోడల్‌లో అందించే అన్ని ఇంజన్ ఆప్షన్లను ఇందులో ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌లో అనేక కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. అయితే ఇంజన్స్‌లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు.

Recommended