IND VS NZ,2nd Test : Fans Troll Ravindra Jadeja After Taking Review For No Ball
  • 4 years ago
IND VS NZ,2nd Test : A star-studded Indian team was given a reality check by a disciplined New Zealand side that completed a memorable series sweep with a seven-wicket win inside three days in the second Test here on Monday.
#ViratKohli
#ravindrajadeja
#indvsnz2ndtest
#rohitsharma
#mayankagarwal
#jaspritbumrah
#mohammedshami
#umeshyadav
#kanewilliamson
#cricket
#teamindia

సుదీర్ఘ న్యూజిలాండ్‌ పర్యటన ముగిసింది. హెగ్లే ఓవల్‌ వేదికగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో భారత్‌పై న్యూజిలాండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను కివీస్ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అంతకుముందు వ‌న్డే సిరీస్‌ను 3-0తో భారత్ కోల్పోయిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను సోష‌ల్ మీడియాలో భారత ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. మీమ్స్‌, కామెంట్ల‌తో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు దిగిన 'సర్' రవీంద్ర జ‌డేజా ఘోర త‌ప్పిదానికి పాల్ప‌డ్డాడు. స్పిన్న‌ర్ అయి ఉండి నోబాల్ వేసాడు. ఓ బంతికి కివీస్ బ్యాట్స్‌మెన్ ఔట‌య్యాడ‌ని ఎంపైర్‌ను కోరగా.. అతడు నిరాకరించాడు. దీంతో జడేజా రివ్యూ తీసుకున్నాడు. ఇక రిప్లేలో జడేజా నోబాల్ వేసినట్టు తేలింది. అప్పటికే సంబరాలు చేసుకుంటున్న జడేజా.. రిప్లేలో తన తప్పిదం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జడేజా వైపు చూస్తూ వెళ్ళిపోయాడు.
'సర్' రవీంద్ర జ‌డేజా తప్పిదం కారణంగా టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కివీస్ బ్యాట్స‌మెన్ బతికిపోవ‌డమే కాకుండా.. ఒక ర‌న్‌ను ఎక్స్‌ట్రాగా స‌మ‌ర్పించుకుంది. జడేజా వ్య‌వ‌హారంపై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. గ‌తంలో కూడా జ‌డ్డూ నోబాల్స్ వేసి భార‌త విజ‌య అవ‌కాశాల్ని దెబ్బ‌తీశాడ‌ని గుర్తు చేస్తున్నారు. 'నోబాల్ వేసి రివ్యూ తీసుకుంటావా?' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'నీవల్ల ఎక్స్‌ట్రా ర‌న్‌ కూడా వచ్చింది' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు.
Recommended