యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ చిత్రాన్ని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తుండగా ఒరిజినల్ వెర్షన్ డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ‘జాను’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.