India -Nepal Kalapani Border Issue, MEA Says No Changes In New Map !
  • 4 years ago
India on Thursday said the new map issued by it in November 2019 accurately depicts its sovereign territory and it has in no manner revised its boundary with Nepal.
#India-Nepal
#India-NepalBorder
#KalapaniBorder
#MEA
#raveeshkumar
నేపాల్‌తో సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత కేంద్ర హొంశాఖ కొత్తగా తీసుకువచ్చిన మ్యాప్ పై నేపాల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. భారత్ కొత్తగా డిజైన్ చేసిన మ్యాప్‌లో సరిహద్దులోని కాలాపాని ప్రాంతాన్ని భారత్‌లో కలిపేయడం సరికాదని నేపాల్ అభ్యంతరం తెలిపింది. అయితే కాలాపాని ప్రాంతం నేపాల్‌కు చెందుతుందని దీన్ని భారత్ సరిచేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల కార్యదర్శి రవీష్ కుమార్ స్పష్టత ఇచ్చారు.
కొత్తగా రూపొందించిన మ్యాప్‌లో అన్నీ కరెక్టుగానే ఉన్నాయని సరిహద్దు ప్రాంతాల పరిధిని కూడా దాటలేదని క్లారిటీ ఇచ్చారు రవీష్ కుమార్. అయితే సరిహద్దు రేఖలను డిజైన్ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు. భారత్‌ భూభాగం ఏమేరకు ఉందో మ్యాప్‌లో కూడా అంత వరకే ప్రస్తావించామని రవీష్ చెప్పారు. అంతేకాదు పరిధి మించి మరో దేశ బౌండరీలను భారత్‌ మ్యాప్‌లో కలపలేదని వివరణ ఇచ్చారు. నేపాల్‌తో సరిహద్దుల విషయంలో ఎలాంటి పరిధులు దాటలేదని చెప్పారు. పాత మ్యాప్‌లో ఎలా అయితే ఉన్నిందో కొత్త మ్యాప్‌లో కూడా సరిహద్దులు అలానే ఉన్నాయని చెప్పారు.
జనవరి 15న సరిహద్దు విషయమై భారత్‌తో నేపాల్ ప్రభుత్వం చర్చలు జరుపుతుందని నేపాల్ మీడియా కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో విదేశీవ్యవహారాల శాఖ కార్యదర్శి రవీష్ కుమార్ సరిహద్దులపై స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది
Recommended