AP Govt Identified Nearly 21.58 Lac People ineligible govt welfare schemes benefits
  • 4 years ago
AP Govt identified nearly 21.58 lac people ineligible govt welfare schemes benefits. Govt not yet taken final decision on these people.
#APGovt
#apcmjagan
#welfareschemes
#Arogyasri
#Pension
#rationcards
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల లబ్దిదారుల్లో కోత పడుతోంది. అనర్హుల పేరుతో లక్షలాది మందిని పధకాలకు దూరం చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం పలు సంక్షేమ పధకాల్లో లబ్దిదారులుగా ఉన్న 21.58 లక్షల మందిని అనర్హులుగా తేల్చినట్లు తెలుస్తోంది. అందులో ఎక్కవ మంది రేషన్ కార్డు లబ్దిదారులే ఉన్నట్లు సమాచారం. దాదాపు 14.25 లక్షల అనర్హులు రేషన్ కార్డు కలిగి ఉన్నారని తాజాగా ప్రభుత్వం నిర్వహించిన వైయస్సార్ నవశకం సర్వేలో తేలింది. అదే విధంగా ఫించన్లు..ఆరోగ్య శ్రీ అందుకుంటున్న వారిలోనూ అనర్హుల సంఖ్య తేల్చారు నవంబర్ 20 నుండి డిసెంబర్ 20 దాకా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన వైయస్సార్ నవశకం సర్వేలో ఈ అనర్హుల జాబితాను జిల్లాల వారీగా తేల్చారు.

ప్రభుత్వ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ నవశకం పేరుతో వార్డు..గ్రామ వాలంటీర్లుతో ఇంటింటి సర్వే నిర్వహించింది. అందులో ప్రతీ ఇంటి నుండి సభ్యులు..వారి ఆదాయం వంటి వివరాలను క్షేత్ర స్థాయిలో సేకరించింది. ప్రభుత్వ పధకాల్లో లబ్దిదారులుగా ఉన్న వారి వివరాలను సమీకరించింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 11 సంక్షేమ పధకాలకు సంబంధించి ప్రజల నుండి కొత్తగా దరఖాస్తులు తీసుకోవటంతో పాటుగా లబ్దిదారుల అర్హతనూ పరిశీలించింది. అనేక దశల్లో లబ్దిదారుల వడపోత చేపట్టారు. అందులో రేషన్ కార్డులు..ఆరోగ్యశ్రీ.. జగనన్న విద్యా దీవెన.. వైయస్సార్ ఫించన కానుక..వంటివి అందుకుంటున్న వారి నుండి ఈ వివరాలు సేకరించారు. కాగా, ఈ వడపోత తరువాత ప్రాధమిక అంచనా మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పధకాల్లో మొత్తంగా 21 లక్షల 58 వేల 375 మంది ప్రస్తుత లబ్దిదారుల్లో అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది.

లబ్దిదారుల్లో అనర్హులుగా గుర్తించిన వారిని తొలిగించే విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. అయితే, వారిని కొనసాగించే విషయంలో మాత్రం తర్జన భర్జన సాగుతోంది.
Recommended