Dhoni Leads No.1 Position In McAfee's List Of Most-Perilous Celebrities In The World || Oneindia
  • 4 years ago
Indian cricketer MS Dhoni has topped the 2019 McAfee Most Perilous Celebrity list of celebrities generating the riskiest search results that could potentially expose their fans to malicious websites and viruses. He is followed by former cricketer Sachin Tendulkar and Gautam Gulati, winner of the reality TV show Bigg Boss.
#McAfee
#msdhoni
#sachintendulkar
#sunnyleone
#GautamGulati
#ShraddhaKapoor
#HarmanpreetKaur
#PVSindhu
#CristianoRonaldo


భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ, దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. బాడ్మింటన్ ఆటలో పీవీ సింధు.. బాలీవుడ్‌ బోల్డ్‌ నటి సన్నీ లియోన్‌లకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరందరికి మన దేశంలోనే కావు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉంటారు. తమ తమ అభిమాన క్రికెటర్లు, సినీతారల సమాచారం కోసం అభిమానులు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు.అభిమానులు తమ ఫేవరెట్‌ స్టార్ల సమాచారం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నప్పుడు నకిలీ లింకులు దర్శనమిస్తున్నాయి. వాటిని ఓపెన్‌ చేస్తే అవి అశ్లీల, ప్రమాదకర వెబ్‌సైట్లకు దారితీస్తుంటాయి. ఇంటర్నెట్‌ వాడకంపై అంతగా అవగాహన లేనివారు ఆ లింక్‌లపై క్లిక్‌ చేసి ప్రమాదంలో పడుతున్నారు. ఈ క్రమంలో ధోనీ, సచిన్‌, సన్నీ లియోన్‌ల గురించి సెర్చ్‌ చేసినప్పుడు ఎక్కువగా మాలీసియస్‌ వెబ్‌సైట్లకు లింకులు రీడైరెక్ట్‌ అవుతున్నాయి.
Recommended