#EastGodavari : లోయలో పడ్డ పర్యాటక బస్సు,10 మంది మృతి || Oneindia Telugu

  • 5 years ago
ఏపీలో మరో దుర్ఘటన చోటు చేసుకుంది.తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం టూరిస్టు బస్సు లోయలో పడింది. ఈ ఘోర ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మారేడుమిల్లి చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది.పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.బస్సులో 20కు పైగా మంది ప్రయాణించినట్లు సమాచారం.అయితే ఈ ప్రమాదం ఎలా చోటుచేసుకుంది..? డ్రైవర్ తప్పిదమా..? లేకుంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనేది తెలియాల్సి ఉంది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


#EastGodavari
#RoadAccident
#Maredumilli
#chinthuru
#touristbus