Niti Aayog VC Rajiv Kumar Meets CM YS Jagan || జగన్ ను కలిసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్‌
  • 5 years ago
Niti Aayog vice-chairman Rajiv Kumar meets with AP Chief Minister YS Jagan Mohan Reddy in Amaravati on Friday. During the meeting, both the leaders discussed the funds and bifurcation promises which are supposed to fulfilled by the central government.
#apcmysjagan
#NitiAayog
#vicechairman
#RajivKumar
#Amaravati
#bifurcation


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన, దూరదృష్టి, ప్రణాళికలు చాలా బాగున్నాయని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ వచ్చినప్పుడు తనతో సుదీర్ఘంగా చర్చించారని, నవరత్నాల గురించి వివరించారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యాన, రెవెన్యూ రంగాల్లో చేపట్టిన చర్యలు, వివిధ రంగాల్లో అవకాశాలపై రాజీవ్‌కుమార్‌ శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో కలసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అంకితభావం, విజన్‌ తనను ఆకట్టుకున్నాయని ఈ సందర్భంగా రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు నెలల్లోనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చక్కటి పనితీరు చూపారని అభినందించారు.
Recommended