పోలవరంకు YS రాజశేఖర్ రెడ్డి పేరు || Polavaram Irrigation Project Likely To Be Named As YSR Polavaram
  • 5 years ago
Government of Andhra Pradesh YS Jaganmohan Reddy and Irrigation department Officers are thinking on renamed Polavaram Project as YSR Polavaram Project. On the day of Chief Minister late YS Rajasekhar Reddy tenth death anniversary.. huge demand were raised by the YSR Congress Party leaders.
#polavaram
#andhrapradesh
#chiefminister
#ysrajasekharreddy
#ysjagan
#chandrababu
#tdp
#ysrcp


రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తోన్న పోలవరం భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా జల వనరుల శాఖ కొన్ని ప్రతిపాదనలను రూపొందించిందని సమాచారం. త్వరలోనే వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలన కోసం ఆయన కార్యాలయానికి పంపించ వచ్చని అంటున్నారు. వైఎస్ఆర్ పోలవరం అనే పేరు పెట్టాలని జల వనరుల మంత్రిత్వశాఖ అధికారులు సూచనప్రాయంగా నిర్ణయించిందని చెబుతున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనికయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్ పేరును ఆ ప్రాజెక్టుకు పెట్టడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు సైతం వినిపిస్తున్నాయి.

Recommended