ఇందిరా పార్కు వద్ద TDP నేతల ధర్నా || TS TDP Leaders Dharna At Indira Park Over Double Bed Room Homes
  • 5 years ago
The Telangana TDP Mahadarna has taken up the demand for the construction of double bedroom houses by the TRS government and demanding immediate housing for the poor. The dharna held at Indira Park was attended by party workers from all districts of Telangana. Telangana TDP President L. Ramana said that NTR has introduced a next-door scheme for the poor and Chandrababu has pursued his wishes. But the KCR government has alleged that it failed to provide double bedroom houses for the poor.
#Telangana
#TDPLeaders
#TRS
#KCR
#Dharna
#IndiraPark
#DoubleBedRoomHomes
#mechanageswararao
#Lramana

బుల్ బడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని టీఆర్‌ఎస్ సర్కారు జాప్యం చేస్తోందని, వెంటనే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టీడీపీ మహాధర్నా చేపట్టింది. ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదలకు పక్కా ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆయన ఆశయాలను చంద్రబాబు కొనసాగించారని.. కానీ కేసీఆర్ సర్కారు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కల్పించడంలో విఫలమైందని ఆరోపించారు. కేసీఆర్ 6 ఏళ్ల పాలనపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రోజు రోజుకు పాతాళంలోకి వెళ్తోందని విమర్శించారు. రూ.రెండు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పేదల ఇళ్లకు మోక్షం కలగడం లేదని, ఏ పథకం కూడా పూర్తిగా అమలు కావడం లేదని ఆరోపించారు. ప్రగతి భవన్ సీఎం కేసీఆర్ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, రాష్ట్రంలో ఉండే ప్రతి పేదబిడ్డకు ఇల్లు అందేవరకు టీడీపీ పోరాటం చేస్తుందని రమణ వ్యాఖ్యానించారు.
Recommended