ICC Cricket World Cup 2019: Sarfaraz, Who Came To Bat At 8th Place In South Africa VS Pak Match
  • 5 years ago
Pak kept alive their slender hopes of making the semifinals while knocking South Africa out of the ICC World Cup with a 49-run win at London on Sunday. Batting first, the 1992 champions posted 308 for seven with Haris Sohail’s 59-ball 89 being the highlight of their innings. In reply, South Africa were stopped at 259 for nine in 50 overs.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#pakvssouthafrica
#southafrica
#Sarfaraz
#fakharzaman
#harissohail
#babarazam

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌పై పరాజయం తర్వాత పాకిస్తాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అటు కెప్టెన్సీలోనూ ఇటు ఆటలోనూ వైఫల్యం చెందడంతో సర్ఫరాజ్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు, అభిమానులు విరుచుకుపడ్డారు. ఆ వివాదం సమసిపోకముందే పాక్ అభిమానులు మళ్లీ సర్ఫరాజ్‌పై విరుచుకుపడుతున్నారు.

ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 49 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి పాక్ ముందుగా బ్యాటింగ్‌ చేసింది.అయితే టాపార్డర్‌ భారీ స్కోర్ చేసిన సమయంలో కెప్టెన్‌ సర్పరాజ్‌ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చే సర్పరాజ్‌.. లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ దిగడమే చర్చనీయాంశమైంది. ఇమాద్‌ వసీం ఐదో వికెట్‌గా పెవిలియన్‌ చేరిన తర్వాత సర్ఫరాజ్‌ బ్యాటింగ్‌కు రావాలి. ఇమాద్‌ ఔట్‌ అయిన అనంతరం వహాబ్‌ రియాజ్‌ బ్యాటింగ్‌కు దిగాడు. అప్పటికి 48 ఓవర్లు పూర్తయ్యాయి. జట్టు స్కోర్ 295. ఈ సమయంలో భారీ హిట్టింగ్ చేయాలి. కానీ వహాబ్‌ 4 బంతుల్లో 4 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఈ స్థానంలో సర్పరాజ్‌ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే పాక్‌ స్కోరు మరింత పెరిగేది.
Recommended