జగన్ విశాఖ పర్యటన... శారదా పీఠాధిపతికి ఆహ్వానం..? || Oneindia Telugu

  • 5 years ago
The AP Chief Minister YS Jagan Mohan Reddy to visit Visakhapatnam on Tuesday (4 June). On the occasion, YS Jagan will be meeting with Vishaka Sri Sarada Peetham chief Swami Swaroopananda and will be taking his blessings. Jagan is likely to be invited to attend the ministerial swearing-in ceremony on june 8. Swamy advices and suggestions will also be taken on the swearing-in ceremony, such as the Muhurtham, to enter the Chamber of the Secretariat.
#andhrapradesh
#apcmjagan
#invitation
#chandrababu
#visakapatnam
#SriSaradaPeetham

శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ దర్శనానికి వైసీపీ అధినేత ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించనున్న నేపధ్యంలో ఆయన పర్యటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసలు జగన్ స్వామీజీని కలవటానికి ఎందుకు వెళ్తున్నారు . కేవలం ఆశీర్వచనం కోసమా ? లేదా ఇంకేదైనా కారణం ఉందా ? అని అందరూ ఆలోచనలో పడ్డారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జగన్ విశాఖ శారదా పీఠానికి వెళ్తున్న ఏపీ సీఎం జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందస్వామితో భేటీ అవుతారు. మంత్రివర్గ ఏర్పాటు కోసం సీఎం వైఎస్ జగన్ శ్రీ శారదా పీఠాధిపతి సలహాలు సూచనలు తీసుకుంటారని సమాచారం. ఈ నెల 8న జరగనున్న మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్వరూపానందేంద్ర స్వామిని జగన్ ఆహ్వానించనున్నట్టుగా తెలుస్తుంది .

Recommended