మ‌హానాడును ర‌ద్దు చేసి... NTR జ‌యంతి వేడుకలు!! | Oneindia Telugu

  • 5 years ago
Former Minister of Andhra Pradesh Nara Lokesh is participated in Telugu Desam Party Founder and Former Chief Minister of Andhra Pradesh NT Ramarao's Birth Day Celebrations. Nara Lokesh is participated at Participated at Mangalagiri in Guntur District. He addressed the Party leaders, Workers and Supporters after that.
#tdp
#ntr
#formercm
#AP
#mangalagiri
#guntur
#naralokesh
#Chandrababu

తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త ఎన్టీ రామారావు జ‌యంత్యుత్స‌వాల‌ను గుంటూరు జిల్లా నాయ‌కులు ఘ‌నంగా నిర్వ‌హించారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజ‌ర‌య్యారు. ఎన్టీ రామారావు విగ్ర‌హానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంత‌రం ఆయ‌న ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద సంఖ్య‌ల హాజ‌రైన జిల్లా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. సామాన్యుడిగా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసిన అసామాన్య‌డని అన్నారు. ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం క‌లిగించ‌డానికి ఆయ‌నే ప్ర‌ధాన కార‌కుల‌ని చెప్పారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను రాజ‌కీయాల్లోకి తీసుకొన్ని ఘ‌న‌త ఎన్టీఆర్‌దేన‌ని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన‌లేని కృషి చేశార‌ని అన్నారు. తెలుగువారి జీవనగతినే మార్చేశార‌ని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయ‌నను స్ఫూర్తిగా తీసుకుని ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌ని సూచించారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేందుకు క్రమశిక్షణతో పనిచేస్తూ, నిరంతరం ప్రజలకు అండగా ఉండాలని కార్యకర్తలకు అభిమానులకు సూచించారు.

Recommended