ఏమంటారు KTR సార్... చెల్లని రూపాయిల లెక్క తేలిందా..! || Oneindia Telugu
  • 5 years ago
Some Leaders Defeated In Assembly Elections From Congress and BJP. Once Again they came into fight in Lok Sabha Elections. In That View, TRS Working President KTR sentenced to that they were not valid as one rupee coin. But when results came, all that mla defeated candidates won in MP seats.
#loksabhaelectionresults2019
#telangana
#kishanreddy
#uttamkumarreddy
#kalvakuntlakavitha
#nizamabad
#karimnagar


లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చెల్లని రూపాయి మాట హాట్ టాపికయింది. అక్కడ చెల్లని రూపాయిలు ఇక్కడ చెల్లుతాయా అంటూ టీఆర్ఎస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన కొందరిని టార్గెట్ చేస్తూ వారు వాడిన పదజాలం రివర్స్ కొట్టింది. అందుకే చెల్లని రూపాయిలు చెల్లినయిగా అంటూ ఎదురు దాడి చేస్తున్నారు విపక్ష నేతలు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సారు.. కారు.. పదహారు అంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. అదే సమయంలో విపక్ష నేతలను ఉద్దేశించి చెల్లని రూపాయిలంటూ వ్యాఖ్యానించడం.. తీరా ఫలితాలొచ్చాక చూస్తే అవి చెల్లుబాటుకావడం చర్చానీయాంశమైంది.
Recommended