'Dinesh Karthik's ODI Future Is Over' Says Sanjay Manjrekar | Oneindia Telugu
  • 5 years ago
Dinesh Karthik's exclusion from the Indian squad for the five-match ODI series against Australia came as a big shock for many as the MSK Prasad-led BCCI selection committee announced the teams on Friday.
#DineshKarthik
#SanjayManjrekar
#Indiavsaustralia2019
#MSKPrasad
#BCCIselectioncommittee

టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ వన్డే కెరీర్ ఇక ముగిసినట్లేనని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది. దినేశ్ కార్తీక్‌ను కేవలం టీ20లకు మాత్రమే ఎంపిక చేశారు. వన్డేల్లో అతడి స్థానంలో సెలక్టర్లు రిషబ్ పంత్‌కు అవకాశమిచ్చారు.
దీంతో ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న వన్డే వరల్డ్ కప్‌లో దినేశ్ కార్తీక్ ఆడటం అనుమానంగానే మారింది. జట్టులో శిఖర్ ధావన్‌తో పాటు ఎవరూ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ లేకపోవడమే రిషబ్ పంత్‌కి కలిసొచ్చింది. తాజా ఎంపికతో దినేశ్ కార్తీక్ వన్డే కెరీర్ ముగిసిందని.. ఇక అతడు టీ20లకే పరిమితమవుతాడనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ "ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం టీమ్ సెలక్షన్‌పై దినేశ్ కార్తీక్ అభిమానులు కచ్చితంగా పెదవి విరుచుంటారు. గత కొంతకాలంగా కార్తీక్ అవకాశం దొరికిన ప్రతిసారి.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ప్రయత్నం చేశాడు. తాజాగా సెలక్టర్లు అతడి కెరీర్‌పై ఓ స్పష్టత ఇచ్చేశారని నేను అనుకుంటున్నా" అని అన్నాడు.
"ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టీ20ల సిరిస్‌కి మాత్రమే ఎంపిక చేయడం ద్వారా.. వన్డే కెరీర్‌ ఇక ముగిసిపోయిందని చెప్పకనే చెప్పారు. దినేశ్ కార్తీక్‌ను సెలక్టర్లు టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ప్రస్తుతం చూస్తున్నారు" అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20లు, ఐదు వన్డేల సిరిస్ ఆడనుంది.
ఫిబ్రవరి 24న విశాఖపట్నం వేదికగా జరిగే తొలి టీ20తో ఈ సిరిస్ ప్రారంభం కానుంది. భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన మార్చి 13తో ముగియనుండగా.. ఆ తర్వాత మార్చి 23 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానుంది. అనంతరం రెండు వారాల వ్యవధిలోనే మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌‌కప్ ప్రారంభం కానుంది.
Recommended