Lok Sabha Election 2019: Ongole Lok Sabha Constituency | Sitting MP, MP Performance Report
  • 5 years ago
Lok Sabha Election 2019:Know detailed information on Ongole Lok Sabha Constituency in video. Get information about election equations, sitting MP, demographics, social picture, performance of current sitting MP, election results, winner, runner up, & much more on Ongole.
#LokSabhaElection2019
#Ongoleloksabhaconstituency
#Y.V.SubbaReddy
#MaguntaSreenivasuluReddy
#tdp
#ysrcp

ఎందరో యోధులు..మ‌హా మ‌హులు కొలువు తీరిన ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో చ‌రిత్ర ఉంది. ప్ర‌కాశం జిల్లా ముఖ్య కేంద్రంగా ఉన్న ఒంగోలు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, ఎంద‌రో ప్ర‌ముఖుల‌ను లోక్‌స‌భ కు పంపారు. వ్యాపార‌- వాణిజ్య‌- రాజ‌కీయంగా ఈ నియోజ‌క‌వ‌ర్గం ముఖ్య భూమిక పోషిస్తోంది. ఇక‌, సామాజిక వ‌ర్గాల బ‌లా బ‌లాలే ఇక్క‌డ రాజ‌కీయంగా ప్ర‌భావితం చేస్తాయి. దీంతో..ఒంగోలు పార్ల‌మెంట్ ప‌రిధిలో ప్ర‌తీ సారి ఎన్నిక‌లు ఆస‌క్తి క‌ర‌మే. ఒంగోలు లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో దాదాపు 22 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నారు. 2014 ఎన్నిక‌ల ప్ర‌కారం ఇక్క‌డ మొత్తం 20,22 ,411 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో రూర‌ల్ ఓట‌ర్లు 78.18 శాతం కాగా, అర్బ‌న్ ఓట‌ర్లు 21.82 శాతంగా ఉన్నారు. ఎస్సీలు - 22.47 శాతం, ఎస్టీ జ‌నాభా 3.92 శాతంగా ఉంది. ఇక‌, ఇదే లోక్‌స‌భ నియెక‌వ‌ర్గం నుండి ప్ర‌ముఖ సినీ న‌టుడు కొంగర జ‌గ్గ‌య్య ,మాద‌ల నారాయ‌ణ స్వామి, బెజ‌వాడ పాపిరెడ్డి లాంటి ఉద్దండులు ఇక్క‌డి నుండి గెలిచారు. మాగుంట శ్రీనివాసుల రెడ్డి మూడు సార్లు. మాగుంట సుబ్బ‌రామిరెడ్డి ఒకసారి గెలిచారు.
Recommended