World Cup 2019: MSK Prasad Reveals World Cup Plans | Oneindia Telugu
  • 5 years ago
Chief Indian selector MSK Prasad revealed that the committee has narrowed down 18 players for World Cup 2019 and that BCCI will speak to their respective IPL franchises to manage their workload.
#WorldCup2019
#MSKPrasadonworldcupteamsquard
#Viratkohli
#MSDhoni
#rohithsharma
#jasprithbumrah
#BCCI
#IPL2019
#IPLfranchises
#cricket
#teamindia

ఆస్ట్రేలియాతో రెండు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలక్టర్లు ప్రకటించారు. తొలి రెండు వన్డేలకు, చివరి మూడు వన్డేలకు, రెండు టీ20లకు ప్రత్యేకంగా జట్లను ప్రకటించింది.
న్యూజిలాండ్‌ పర్యటనకు మధ్యలోనే దూరమైన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బుమ్రా ఈ మ్యాచ్‌లకు తిరిగి జట్టులో చేరారు. దీంతో విరాట్‌ కోహ్లీ తిరిగి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనుండగా, రోహిత్‌ శర్మను వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. ఫిబ్రవరి 24న విశాఖపట్నంలో జరిగే తొలి టీ20తో భారత్‌లో ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభం కానుంది.
జట్టు ప్రకటన అనంతరం టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "వరల్డ్‌కప్ కోసం మేం 18 మందితో కుదించిన జాబితాను రూపొందిస్తాం. ఐపీఎల్‌లో వాళ్లను రొటేషన్ పద్ధతిలో ఆడిస్తాం. వారిలో నుంచి మెగా ఈవెంట్ కోసం జట్టును సిద్ధం చేస్తాం. పని భారాన్ని ఎలా పంచుకోవాలన్న దానిపై ఓ ప్రణాళికను రూపొందిస్తాం. రాబోయే రోజుల్లో దీనిపై సమగ్రంగా చర్చ జరిపి అన్ని విషయాలను వెల్లడిస్తాం" అని అన్నాడు.
"అయితే స్టార్ క్రికెటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు అంగీకరిస్తాయా? అన్నది తేలాల్సి ఉంది. ఈ ప్రశ్నకు గాను బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి మాట్లాడుతూ "ఈ విషయంపై ఫ్రాంచైజీలు కూడా ఆందోళనలోనే ఉన్నాయి. కానీ వాళ్లను ఒప్పించేలా చర్యలు చేపట్టాలి. ఎందుకంటే ఇది వరల్డ్‌కప్ ఏడాది" అని అన్నారు.
Recommended