The Selection Committee Has Started Drills To Select The World Cup Team | Oneindia Telugu
  • 5 years ago
The One Day World Cup starts on May 30 this year. The two T20s and five ODIs will start from February 24 with Australia. The selectors were ready to select the team for the last series to be played before the World Cup start.
#Worldcup2019
#indiavsaustralia
#khaleelahmed
#jaydevunadkat
#odis
#teamindia
#cricket
#dineshkarthik
#rishabpanth
#australia
#ipl

ఈ ఏడాది మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 24 నుంచి రెండు టి20లు, ఐదు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్ ఆరంభానికి ముందు టీమిండియా ఆడనున్న చివరి ద్వైపాక్షిక సిరీస్‌కు జట్టును ఎంపిక చేసేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో జట్టు ఎంపిక కోసం శుక్రవారం ముంబైలో జాతీయ సెలక్టర్లు సమావేశం కానున్నారు. కివీస్‌తో మూడో వన్డే తర్వాత విశ్రాంతి తీసుకున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఈ సిరీస్‌కు పూర్తి స్థాయి అందుబాటుతో వస్తున్నాడు.
పదిహేను మందిలో 13 మంది ఆటగాళ్లు ఇప్పటికే ఖరారైపోయినట్టు సమాచారం. కేవసం రెండు స్థానాలపైనే సెలక్టర్లు నిర్ణయించుకోవాల్సి ఉంది. అందులో ఒకటి రెండో వికెట్‌కీపర్‌ స్థానం కాగా.. మరొకటి లెఫ్టార్మ్‌ పేసర్‌ బెర్తు. రెండో వికెట్‌కీపర్‌ కోసం రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. మరోవైపు యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ నిలకడలేమి దృష్ట్యా అనుహ్యంగా తెరపైకి జయదేవ్‌ ఉనాద్కత్‌ పేరు వచ్చింది.
Recommended