Senior Actor Sarath Babu Responds On Relationship With Ramaprabha

  • 5 years ago
ctor Sarath Babu has responded to the slew of Comments by his Ex wife and actress Rama Prabha
#ramaprabha
#sarathbabu
#SeniorActors
#Oldmovies

ప్రముఖ నటుడు శరత్ బాబు, సీనియర్ నటి రమాప్రభ మధ్య ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. రమాప్రభ పలు ఇంటర్వ్యూలలో శరత్ బాబు తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూనే ఉంది. కానీ శరత్ బాబు మాత్రం రమాప్రభ ఆరోపణలపై ఎలాంటి స్పందన తెలియజేయకుండా సైలెంట్ గా ఉంటున్నారు. ఎట్టకేలకు ఓ ఇంటర్వెలో శరత్ బాబు రమాప్రభతో ఉన్న సంబంధం గురించి వివరించారు. రామాప్రభ పేరు ప్రస్తావించకుండా తాను ఆమెకు ఎలాంటి అన్యాయం చేయలేదని తెలిపారు.

తాను 22 ఏళ్ల వయసులో ఆ మహిళని కలిశానని శరత్ బాబు పరోక్షంగా రమాప్రభని ఉద్దేశించి అన్నారు. అది పెళ్లంటే పెద్దగా అవగాహన లేని వయసు. ఆమె తనకంటే అప్పటికి ఆరేళ్ళు వయసులో పెద్దది అని శరత్ బాబు తెలిపాడు. మా ఇద్దరిమధ్య సంబంధం పెళ్లి కాదు. ఆ సంబంధానికి పేరే లేదు అంటూ శరత్ బాబు వ్యాఖ్యానించారు. తాము కలసి ఉన్నా ఎప్పుడూ అన్యోన్యంగా లేము అని శరత్ బాబు తెలిపారు.

రమాప్రభతో తనకు పరిచయం ఏర్పడేసరికి తాను నటుడిగా రాణిస్తున్నానని, హీరోగా చిత్రాలు చేస్తున్నానని శరత్ బాబు తెలిపారు. దర్శకులు, నిర్మాతలతో మాట్లాడి ఆమె తనకు అవకాశాలు ఇప్పించిందనేదిఅవాస్తవం అని శరత్ బాబు తెలిపారు. తాను నటుడిగా రాణిస్తున్నాను కాబట్టే అవకాలు వచ్చాయి. తమిళ నటుడు నంబియార్ కుమార్తెని నేను వివాహం చేసుకున్నా, నా మొదటి భార్య ఆమే అని శరత్ బాబు తన పెళ్లి విషయం గురించి మాట్లాడారు.

తాను ఆమెని మోసం చేయలేదని శరత్ బాబు తెలిపారు. తనకు నటుడిగా మంచి గుర్తింపు లభించిన తర్వాతే ఆమెతో పరిచయం ఏర్పడింది. ఆమెని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. తన ఆస్తిని లాక్కుని నడిరోడ్డుపై వదిలేశాడనే రమాప్రభ చేస్తున్న వ్యాఖ్యలని శరత్ బాబు ఖండించారు. తనతో పరిచయం కాకముందే రమాప్రభకు మరో వ్యక్తితో పరిచయం అయిందని శరత్ బాబు హాట్ కామెంట్స్ చేశారు.