2019 Lok Sabha Elections : 2019 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కమలం పార్టీ ప్రణాళిక | Onendia Telugu
  • 5 years ago
The Bharatiya Janata Party (BJP) wants to keep its workers motivated till at least 2019 Lok Sabha elections. So in one such move, the party will be organising around 10 Kilometre long padyatra from every mandal to another important designated location in the city to connect with the people.
#2019LokSabhaElections
# Generalelections2019
#modi
#bjp
#congress
#padyatra


ప్రస్తుతం దేశంలో ఐదురాష్ట్రాల ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగా... బుధవారం రోజున మధ్యప్రదేశ్, మిజోరాంలలో పోలింగ్ జరిగింది. డిసెంబర్ 7న తెలంగాణ, రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రజలతో మమేకం అవ్వాలన్న ఆలోచనలో ఉంది. అంతేకాదు 2019 లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా కార్యకర్తల్లో జోష్‌ను పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి మండలంలో 10 కిలోమీటర్ల మేరా పాదయాత్రకు ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. ఈ పాదయాత్ర ప్రతి మండలంలో మొదలై పట్టణ ప్రాంతాలవరకు సాగేలా ప్లాన్ చేస్తున్నారు. తద్వారా ఇటు గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణాల్లో ఉన్న ప్రజలతో కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు కమలనాథులు. ఈ పాదయాత్రలో ఆయా ప్రాంతాల నుంచి 50 -60 మంది ముఖ్య నాయకులు పాల్గొని ప్రజలను కలుసుకుంటారు.
Recommended