మంత్రి కిడారికి భద్రత పెంపు..బుల్లెట్ ప్రూఫ్ వాహనం..స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ | Oneindia Telugu

  • 5 years ago
Security has been strengthened by the Government of Andhra Pradesh's to tribal minister Kidari Shravan Kumar. In addition to the existing gunmen, the Octopus Commando Security Provided. The bullet proof vehicle, along with two other car convoy has been prepared.
#KidariShravanKumar
#TribalMinister
#AndhraPradesh
#OctopusCommandoSecurity


ఆంధ్రప్రదేశ్ గిరిజన శాఖమంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు భద్రత మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న గన్‌మెన్లకు తోడు అదనంగా ఆక్టోపస్ కమాండోల సెక్యూరిటీ ప్రొవైడ్ చేసింది. ఇకపై కిడారి ఎక్కడికి వెళ్లినా.. ఈ కమాండోలు ఆయన వెంట ఉంటారు. కిడారి సొంత జిల్లా విశాఖతో పాటు విశాఖ ఏజెన్సీలో పర్యటించే సందర్భాల్లో సెక్యూరిటీ మరింత పెంచింది ఏపీ సర్కార్. బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు మరో రెండు కార్ల కాన్వాయ్ ను సిద్ధం చేసింది. అంతేగాకుండా ఆయన సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఆఫీసర్ ను నియమించింది. ప్రతి రోజు ఆయన వెంటే ఉండేలా ఏర్పాట్లు చేసింది. విశాఖతో పాటు ఏజెన్సీలో కిడారి ఎక్కడకు వెళ్లినా.. ఆయనతో పాటే ఈ సెక్యూరిటీ అధికారి వెళుతుంటారు.