బర్త్ డే గర్ల్... నయనతారను సర్‌ప్రైజ్ చేసిన ప్రియుడు, ఫోటోస్ వైరల్!

  • 5 years ago
సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార నేడు తన 34వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె ప్రియుడు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హాట్ బ్యూటీ ఊహించని విధంగా బర్త్ డే బాష్ ప్లాన్ చేశాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నయనతార కొంతకాలంగా తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రస్తుతం ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. అయితే అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవడమే తరువాయి.

Recommended