ఈ సీజన్ కోసమే సంవత్సరమంతా గాలిపటాలు చేస్తాం: వ్యాపారి

  • 6 years ago
with less than a week to go for Independence Day celebrations, kite lovers in Delhi and neighbouring states, are thronging the famous Lal Kuan Market in great numbers to get hold of as many kites as possible. On August 15 everyone will be on their terraces and won't have time to go to the market to buy extra kites. Nobody wants to miss the fun even for a moment.
#independenceday
#lalkaunmarket
#kitesfestival
#politicalkites
#socialmessagekites
#August15

భారత స్వాతంత్ర్య వేడుకలకు కొద్దిరోజులు మాత్రమే సమయం ఉంది. అప్పుడే ఢిల్లీ, పరిసర రాష్ట్రాల్లోని పతంగి ప్రేమికులు పెద్ద సంఖ్యలో ఢిల్లీలోని ప్రసిద్ధిగాంచిన లాల్ కౌన్ మార్కెట్లో వాలిపోయారు. ఎన్ని ఎక్కవ పతంగులైతే అన్ని పతంగులను తీసుకెళ్లేందుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. పతంగులకే ఇంత పోటీ ఏమిటని మీకో ప్రశ్న మదిలో మెదలొచ్చు... అసలు విషయం ఈ పతంగుల్లోనే ఉంది. ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తర్వాత చాలామంది పతంగులు ఎగురవేస్తారు. ఇంకా కొన్ని రోజులు సమయం ఉండగానే ఇప్పుడే ఆ పతంగులను కొనుగోలు చేసేందుకు క్యూలు కడుతున్నారు ఎందుకంటే ఆరోజున కొంచెం కూడా సమయం వృథా చేసుకునేందుకు ఇష్టపడరు పతంగి ప్రియులు. అందుకోసమే ముందే పతంగులు కొనిపెట్టుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడి పతంగులు వివిధ రూపాల్లో, సైజుల్లో, రంగుల్లో లభిస్తాయి.కొన్ని పతంగుల మీద ఒక సందేశం కూడా వస్తుంది. రాజకీయాలనుంచి క్రీడల వరకు, కార్టూన్ క్యారెక్టర్స్ నుంచి సూపర్ హీరోల వరకు అన్నీ ఇక్కడ దొరికే పతంగులపై ఉంటాయి.