మీ ఉద్యోగం కొద్ది రోజుల్లో పోగొట్టుకోనున్నారా??

  • 6 years ago
The International Labour Organisation has predicted that India's unemployment rate in 2018 will stay at 3.5 percent, while China's would edge up from 4.7 percent to 4.8 percent. However, a worrying 77 percent of employment in India would remain vulnerable revealed the report.
#unemployment
#theinternationallabourorganisation
#indiaemployment
#china
#drasticfalljobs


2018లో భారత్‌లో నిరుద్యోగ రేటు 3.5శాతం వద్ద ఉంటుందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. అదే మన పొరుగుదేశం చైనాలో నిరుద్యోగ రేటు 4.7 శాతం నుంచి 4.8 శాతానికి చేరుకోనుందని పేర్కొంది. భారత్‌లో ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడిపోయిందని చెప్పిన సంస్థ... 77శాతం ఉద్యోగాలకు భద్రత లేదని వివరించింది. ఈ సంఖ్య చైనాలో 33శాతంగా ఉంది. "వరల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ ఔట్‌లుక్ - ట్రెండ్స్ 2018" పేరుతో అంతర్జాతీయ కార్మిక సంఘం రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ ఆశావహంగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రత్యేకించి భారత ఆర్థిక వ్యవస్థ 2018లో 7.4శాతానికి ఎగబాకే అవకాశముందని తేల్చింది. 2017లో ఈ సంఖ్య 6.7 శాతంగా ఉన్నింది. భారత ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియా దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తోందంటూ నివేదిక వెల్లడించింది.

Recommended