చేపలు అమ్ముకుంటున్న అమ్మాయికి కేంద్రమంత్రి కేజే ఆల్ఫోన్స్‌

  • 6 years ago
Union minister Alphons Kannanthanam has came out in support of a 21 year old college going fisher woman from Kerala who became the of cyber bulling.
#AlphonsKannanthanam
#Kerala

ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో ఓ విద్యార్థిని చదువుకుంటూనే చేపలు అమ్ముకుంటోంది. కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత చేపలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఆమె పేరు హనన్ హమీద్. ఆమె వయస్సు 19 ఏళ్లు. కేరళకు చెందిన ఈ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ పోస్టును చూసిన చాలామంది ఆమెను అభిమానిస్తుంటే, కొందరు మాత్రం అదంతా నిజం కాదని కొట్టి పారేశారు. ఇది వివాదానికి దారి తీసింది. దీంతో నా బతుకు నన్ను బతకనీయండి అని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు, ఆమెను కొందరు మత చాంధసవాదులు ఎగతాళి చేశారు. చేతికి తొడుగులు వేసుకుందని, వేలికి బంగారు ఉంగరం ధరించిందని, ఆధునిక శైలిలో తల దువ్వుకుందని, పరధా ధరించలేదని కూడా బెదిరించారని తెలుస్తోంది.

Category

🗞
News

Recommended