జగన్‌తో సెల్ఫీ వివాదంపై...స్పందించిన నటి అలేఖ్య ఏంజెల్

  • 6 years ago
After Jagan's personal comments over Pawan Kalyan the film actress Alekya Angel selfi with Jagan has gone viral in social media. For that film actress Alekya Angel responded over the dispute in facebook.

పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగత వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ అభిమానుల నుంచి జగన్ పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి మొదలైంది. తమ అభిమాన నాయకుడిపై వ్యాఖ్యలకు జవాబుగా మహిళలతో వైసిపి అధినేత జగన్ దిగిన ఫోటోలను పవన్ అభిమానులు పోస్ట్ చేసి నిలదీస్తున్నారు.
ఈ క్రమంలో వైసిపి అధినేత జగన్ తో మోడల్ అలేఖ్య ఏంజెల్‌ తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై జగన్ తీవ్రవ్యాఖ్యలు చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో జగన్‌తో సెల్ఫీ పై అలేఖ్య ఏంజల్ స్పందించి వివరణ ఇచ్చింది. అంతేకాదు ఆ ఫోటోను సోషల్ మీడియా నుంచి తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
జగన్ తో తన సెల్ఫీ ఫొటో వైరల్ కావడంతో నటి అలేఖ్య ఏంజల్ స్పందించింది. ఆ ఫొటోను సోషల్ మీడియా నుంచి తొలగించాలనంటూ విజ్ఞప్తి చేసింది. గతేడాది ఫిబ్రవరి 18న ఓ సీడీ లాంచ్ సందర్భంగా లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసంలో ఆయనతో తీసుకున్నసెల్ఫీ ఇదని, ఈ ఫొటో పట్టుకుని రాద్ధాంతం చేయడం తగదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Recommended