Hyderabad Metro Invents A New Scheme హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
  • 6 years ago
hyderabad metro started a new scheme that they provide rented e-scooters.

మెట్రో స్టేషన్ వద్దకు ప్రజా రవాణా లేకపోవటం.. అదే సమయంలో గమ్యస్థానానికి వెళ్లేందుకు వీలుగా సరైన రవాణా సౌకర్యాలు లేకపోవటం కూడా పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో.. మెట్రోలో ప్రయాణించే కంటే ప్రత్యామ్నాయ పద్ధతులు.. వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు.
హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మెట్రో స్టేషన్ల దగ్గర ఎలక్ట్రానిక్ స్కూటర్లను ఏర్పాటు చేయనుంది. ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఎలక్ట్రానిక్ స్కూటర్లను కిలోమీటర్ కు కేవలం ఒక్క రూపాయి అద్దెకు ఇవ్వనున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కిలోమీటరు రూపాయి చొప్పున అద్దెకు ఇచ్చే ఈ- స్కూటర్ కు వెయిటింగ్ ఛార్జిలు వసూలు చేయరని చెబుతున్నారు. కాకుంటే.. ఎంతసేపు వెయిటింగ్ ఛార్జ్ లేకుండా చేస్తారన్న అంశంపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.
Recommended