'Nobody Will Celebrate'–The Day Dhoni Played Mind-Games With Australia

  • 6 years ago
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. ఆటగాడి సామర్థ్యాన్ని అంచనా వేయడంలో దిట్ట. పగ్గాలు చేపట్టిన కొత్తలోనే అటు సీనియర్లు, ఇటు జూనియర్లను ఏకతాటిపై నడిపించి తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ముఖ్యంగా.. జట్టు ఓడే స్థితిలో ఉన్నా.. ఈ కూల్ కెప్టెన్.. ఎప్పుడూ ఆటగాళ్ల ఆత్మస్థైర్యం మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తపడేవాడు. ఈ లక్షణాలే అతడ్ని ప్రపంచంలోనే విజయవంతమైన కెప్టెన్స్ జాబితాలో నిలిపింది. తాజాగా ధోనీ కెప్టెన్సీ గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.సుదర్శన్ అనే రచయిత ఇటీవల రాసిన ‘ధోనీ టచ్' అనే పుస్తకంలో ఇలా రాసుకొచ్చాడు. 2008లో ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఓడించినపుడు అతిగా స్పందించవద్దని సహచరులందరికీ సంకేతాలిచ్చాడట ధోని. అప్పటికి ధోని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్సీ అందుకుని కొన్ని నెలలే అయింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాను భారత్‌.. 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

MS Dhoni is known for his cool and calm demeanour, both on and off the field. In all the time he captained India across formats, he tried to instill this attitude in his team-mates and budding cricketers.
#australia
#msdhoni
#india
#cricket

Recommended