How Bezawada Got the Name విజయవాడలో మరో సొరంగ మార్గం

  • 6 years ago
కొండలు మెండుగా కనిపించే విజయవాడ నగరంలో మరో నూతన సొరంగ మార్గం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడగా బాగా ఫేమస్ అయిన ఈ పాత నగరంలో ఎటు నుంచి ఎటు ప్రయాణించాలన్నా కొండల చుట్టూ తిరిగివెళ్లాల్సి రావడం కద్దు. విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ కారణంగా ఈ నగరంలో అతి తక్కువ దూరం ప్రాంతాల మధ్య ప్రయాణానికి సైతం చాలా సమయం పడుతోంది. ఉదాహరణకు ఒకే వైపు ఉండే గుణదల-బెంజ్‌సర్కిల్‌ మధ్య ప్రయాణానికి సైతం గంటకు పైగా సమయం వెచ్చించాల్సివస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కొండల గుండా సొరంగ మార్గాన్ని ఏర్పాటుచేస్తే ప్రయాణ దూరాన్ని, సమయాన్ని తగ్గించవచ్చన్న నిపుణుల సూచనపై విఎంసీ చర్యలు ఆరంభించింది.

Recommended