టీడీపీ అవిశ్వాసంతో మాకు సంబంధం లేదు: టీఆర్ఎస్

  • 6 years ago
అవిశ్వాస తీర్మానంపై చర్చను శుక్రవారం టీడీపీ ఎంపి కేశినేని నాని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎంపీలకు కావాల్సిన సమాచారాన్ని ఏపీ అధికారులు పంపించారని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు చక్కని వ్యూహంతో నడిపించారన్నారు. అవిశ్వాసంపై చర్చకు ఆమోదం తెలపడం తెలుగు ప్రజల విజయమన్నారు.
ఏపీకి న్యాయం చేయాలని తాము చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనం అన్నారు. కేంద్రం ఏపీకి మొండి చేయి చూపడంతో తాము పోరాట బాట పట్టామని చెప్పారు. మూడు రోజులుగా చక్కని వ్యూహంతో చంద్రబాబు తమను నడిపించారని ఆయన వ్యాఖ్యానించారట. టీడీపీ ఎంపీలు బృందాలుగా విడిపోయి పార్టీల మద్దతు కూడగట్టడం మొదలు.. స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వరకు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు.
అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని టీడీపీ ఎంపీ కేశినేని నాని బుధవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు, రైల్వే జోన్, రాజధాని నిర్మాణం సహా మొత్తం 14 అంశాలపై మాట్లాడుతామని తెలిపారు.

Recommended