16th International Jawa Day Celebrations Going To Be Held At Bangalore
  • 6 years ago
Bangalore Jawa Yezdi Motorcycle Club (BJYMC) To Host 16th International Jawa Day Celebrations

భారతదేశపు అతి పెద్ద జావా యెజ్డి మోటార్‌సైకిల్ కలయిక అతి త్వరలో బెంగళూరులో జరగనుంది.16 వ అంతర్జాతీయ జావా డే సంభరాలను బెంగళూరు జావా యెజ్డి మోటార్‌సైకిల్ క్లబ్ (BJYMC) నిర్వహించనుంది.
ఈ ఏడాది జావా యెజ్డి ఓనర్ల కలయిక జూలై 8, 2018 ఆదివారం నాడు ఉదయం 10:30 గంటలకు బెంగళూరులోని విటల్ మాల్యా రోడ్డులో ఉన్న సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో ఘనంగా ప్రారంభం కానుంది.
అంతర్జాతీయ జావా డే వేడుకలు మొదలైనప్పటి నుండి ఇందులో పాల్గొనేవారి సంఖ్య ప్రతి ఏటా విపరీతంగా పెరుగుతోంది. ఈ ఏడాది జరిగే కార్యక్రమానికి సుమారుగా 500 మోటార్‌సైకిళ్లు మరియు 1000 మందికి పైగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.