బ్యాంకర్లు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలే తప్ప, మోసం చేయొద్దు : చంద్రబాబు

  • 6 years ago
CM Chandrababu Naidu held a meeting with state level bankers on Friday.On this occasion the State Annual Loan Scheme was released by CM Chandrababu.

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల‌ సమావేశంలో రాష్ట్ర బ్యాంకుల తీరు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలే తప్ప..మోసం చేయొద్దని ఆయన సూచించారు. సిఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక సీఎం చంద్రబాబు విడుదల చేశారు.అనంతరం మాట్లాడుతూ బ్యాంకర్లు కొన్ని ప్రాంతాలను మాత్రమే పట్టించుకుంటున్నాయని అది ఎంత మాత్రం సరికాదని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల‌ సమావేశంలో సిఎం చంద్రబాబు రాష్ట్ర వార్షిక రుణప్రణాళిక సీఎం విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం మొత్తం వార్షిక రుణప్రణాళిక రూ.1,94,220 కోట్లు, వ్యవసాయ రుణ ప్రణాళిక మొత్తం: రూ.1,01,564 కోట్లుగా ఉంది. అలాగే కౌలు రైతులకు ఆర్ధిక సాయం రూ.7,500 కోట్లు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణాలు రూ.21,323 కోట్లుగా పేర్కొన్నారు.

Recommended