Amala Akkineni And Some Other Quits From Amma Association

  • 6 years ago
Amala Akkineni, Ranjani Pierre, Sajitha Madambil and Kani Kusruti among 15 other WCC members, in a statement, revealed that they cannot trust AMMA, due to the way it dealt with the Dileep-Malayalam actress
మలయాళ హీరోయిన్ లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కేరళ స్టార్ హీరో దిలీప్‌ను తిరి మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ)లోకి తీసుకోవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. సినీ వర్గాలతో పాటు సాధారణ జనాల నుండి కూడా ఈ విషయమై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 'అమ్మ' నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అందులో సభ్యులుగా ఉన్న ప్రముఖ సినీ నటీమణులు అసోసియేషన్ నుండి తప్పుకుంటున్నారు. తాజాగా అమల అక్కినేనితో సహా 15 మంది డబ్ల్యుసిసి(ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్) సభ్యులు 'అమ్మ' తీరును నిరసిస్తూ ప్రెస్ స్టేట్మెంట్ జారీ చేశారు.
మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(అమ్మ)ను తాము నమ్మబోమని, నటిపై లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న వ్యక్తి ని తిరిగి అసోసియేషన్లోకి తీసుకోవడం దారుణమని వారు తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
‘అమ్మ' వ్యవహారం నిందితుడికి అండగా నిలిస్తున్నట్లు ఉందని..... మీ తోటి నటికి అన్యాయం జరిగితే న్యాయం తరుపున పోరాడాల్సింది పోయి ఇలా వ్యవహరించడం దారుణమని అమల అక్కినేనితో సహా 15 మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో మహిళలకు గౌరవం లేదని.... ఏ విషయంలోనూ లింగ సమానత్వం పాటించడం లేదని, ఇలాంటి ‘అమ్మ' పట్టించుకోక పోగా లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి మద్దతుగా నిలవడం సహించరాని విషయమని పేర్కొన్నారు.

Recommended