గద్వాల నుంచే పతనం: కేసీఆర్‌కు అరుణ వార్నింగ్

  • 6 years ago
Congress leaders DK Aruna and V Hanumantha Rao on Saturday fired at Telangana CM K Chandrasekhar Rao and minister KTR for comments on congress.
#dkaruna
#kcr
#vhanumantharao
#congress
#trs
#soniagandhi
#telangana
#ktr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గద్వాల నుంచే డీకే అరుణ పతనం ప్రారంభమైందని అన్నారు. గద్వాల సభలో కేసీఆర్ అబద్ధాలు చెప్పారని, మామా అల్లుల్లు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసింది కాంగ్రెస్‌ పార్టీ అని డీకే అరుణ గుర్తుచేశారు. గట్టు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం గద్వాలలో పర్యటించిన విషయం తెలిసిందే.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన తనను ఆహ్వానించకపోవడంపై డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయని మొక్కుల పేరిట కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాలను మోసం చేసే వాళ్లు ఎవరో విజయవాడ కనకదుర్గమ్మకు బాగా తెలుసని అన్నారు.

Recommended