తమాషాలా.. జాగ్రత్తగా ఉండండి: టీడీపీ ఎంపీలకు బాబు క్లాస్

  • 6 years ago
AP CM Chandrababu expressed his anger over his MPs who made deregatory comments on the indefinite hunger strikes that leaders have been doing for the steel plant. A video that surfaced yesterday went viral that witnessed the MP's team sitting and making funny comments on the dheeksha that are taking place.
ఏపీలో ఓ వైపు ఉక్కు ఫ్యాక్టరీ సాధనకోసం దీక్షలు జరుగుతుంటే మరోవైపు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ఛలోక్తులు విసురకుంటూ హాయిగా నవ్వుకుంటున్న వీడియో లీకై రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎంపీల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు వెళ్లిన పనేమిటి అక్కడ చేస్తున్నదేమిటని ఎంపీలను ప్రశ్నించారు. ఓ వైపు సీఎం రమేష్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుంటే మీకు వెటకారంగా ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి రిపీట్ చేయొద్దని ఎంపీలకు వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే వారు మాట్లాడుతున్న మాటలను ఎవరో ఎడిట్ చేశారని... వారికి కావాల్సిన మాటలనే కట్ చేసుకున్నారని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. మరోవైపు తమ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారని మరో ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. వీడియో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
#AP
#tdp
#chandrababu
#indefinitehunger
#AvantiSrinivas

Recommended