CM KCR's Life History Will Be Made A Biopic As Udyama Simham

  • 6 years ago
Few days it is heard that Special Telangana Movement chief and the Present Chief Minister KCR's life history will be made a biopic.

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) జీవితం ఆధారంగా సినిమా ప్రారంభమైంది. 'ఉద్యమ సింహం' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో గురువారం లాంచ్ అయింది. ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తుండగా కల్వకుంట్ల నాగేశ్వరరావు పద్మనాయక ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో అట్టహాసంగా జరిగింది.
ఈచిత్రంలో కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ కనిపించబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆయన నడిచే విధానం, హావభావాలను నాజర్ కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా ఎక్కువగా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. కేసీఆర్ చిన్నతనం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన పరిణామాలు, తెలంగాణ ఉద్యమంలో ఆయన సాధించిన విజయాలు తదితర అంశాలు ఇందులో చూపించబోతున్నారు. 2009 కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను ప్రముఖంగా ఫోకస్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనతో సినిమా ముగుస్తుందని సమాచారం.
ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రోజు సినిమా విడుదల చేయడం వెనక ఒక ప్రత్యేక కారణం ఉంది. 2009.. నవంబర్ 29 తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర అవిర్భావ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఈ రోజు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తర్వాత చోటు చేసుకున్నపరిణామాలు డిసెంబర్ 9న తెలంగాణ రాష్టం ఏర్పాటు చేయబోతుస్తున్నట్లు అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసేలా చేసింది. ఆ ప్రకటనతో కేసీఆర్ దీక్షను విరమించారు.

Recommended