Bigg Boss Season 2 Telugu : Nani Faces Criticisms On Anchoring
  • 6 years ago
Bigg Boss 2 First week TRP ratings. Ratings are big shock to bigg boss team
#BiggBoss2

జూన్ 10 న అంతా ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్ బాస్ 2 ఘనంగా ప్రారంభమైంది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ కావడంతో బిగ్ బాస్ 2 సీజన్ పై సర్వత్రా ఆసక్తిని నెలకొని ఉంది. ఎన్టీఆర్ తరహాలో నాని ఆకట్టుకుంటాడా లేదా అనే ఉత్కఠతో అభిమానులంతా ఈ షో కోసం ఎదురుచూసారు. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో తొలివారం ముగిసేసరికి ఒక ఎలిమినేషన్ కూడా పూర్తయిపోయింది. సంజన బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలసిందే. ఇదిలా ఉండగా నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో పై కాస్త నెగిటివ్ ప్రచారం కూడా ఉంది. దీనికి తోడు తాజాగా విడువులైన టిఆర్పి రేటింగ్స్ బిగ్ బాస్ టీంకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి.
బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ సమయంలో బిగ్ బాస్ షోకి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణే లభించింది. నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న రెండవ సీజన్ కూడా మంచి అంచనాలతో ప్రారంభమైంది.
తాజగా విడువులైన టిఆర్పిరేటింగ్స్ లో బిగ్ బాస్ 2 సీజన్ కు షాక్ తగిలిందని చెప్పొచ్చు. అంచనాలకు తగ్గట్లుగా తొలివారం ఈ షో రేటింగ్స్ సాధించలేకపోయింది. షో ఓపెనింగ్ రోజు 15.05 రేటింగ్ వచ్చింది. ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన తొలిసీజన్ ఓపెనింగ్ రోజు 16.18 రేటింగ్ రావడం విశేషం.
Recommended